Saturday, November 23, 2024

ఫార్మా గ్రామాలకు భారీగా భూ సేకరణ?

- Advertisement -
- Advertisement -

9 జిల్లాల్లో 12 కస్టర్లు…ఒక్కో క్లస్టర్ కు వేయి నుంచి 3వేల ఎకరాలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా విలేజ్ కోసం 1,000 నుంచి 3 వేల ఎకరాల భూమి ని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. గత ప్రభుత్వం కందుకూరు వద్ద 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని భావించగా కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మాసిటీపై పునరాలోచనలో పడింది. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్‌ను ఏర్పా టు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజ్‌ లను  ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు 60 కిలోమీటర్ల దూరంలో 9 జిల్లాల్లో 12 క్లస్టర్లలో ఈ ఫా ర్మా విలేజ్‌లను ఏర్పాటు చేయాలని తెలంగా ణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జి ల్లాల్లో ఈ ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో చోట 1000 నుంచి 3వేల ఎకరాల భూమిని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెగా మాస్టర్ ప్లాన్ 2050లో భాగం గా ఏడాదిలోగా ఫార్మా విలేజ్ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్‌ఆర్‌ఆర్, హైవేలకు అనుసంధానం
ఒక్కో సైట్‌లో 20-నుంచి 30 ఫార్మా కంపెనీ లు మాత్రమే ఉండేలా నివాస ప్రాంతాలకు దూరంగా ఈ ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చే యనున్నారు. ఇవి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంటాయి. 10- నుంచి 12 ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేసి ట్రిపుల్ ఆర్, హైవేల ద్వారా వాటిని అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ఫార్మా విలేజీల్లో పని చేసేవారికి నివాసం, విద్య, వైద్యం లాంటి సదుపాయాలను కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక యువతకు ఉద్యోవకాశాలు కల్పించడం కోసం క్లస్టర్లలోనే నైపుణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒ క్కోచోట తక్కువ సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉండటం వల్ల వాటిని పర్యవేక్షించడం తేలిక కావడంతో పాటు కాలుష్యం కూడా తక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఫార్మా సిటీని వికేంద్రీకరించి, ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే వెళ్లొచ్చని, కాబట్టి దూరం సమస్య కాబోదని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News