Friday, November 22, 2024

సంక్రాంతి వేళ ఆర్టీసీ రికార్డు.. ఒక్కరోజే రూ.12కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండగ టీఎస్ఆర్టీసీకి భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది. సంక్రాంతికి వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల నుంచి జనాలు సొంతూర్లకు వెళ్లారు. మహిళలకు ఎలాగూ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావడంతో.. ఈసారి అధిక సంఖ్యలో జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈక్రమంలో జనవరి 13వ తేదీ ఒక్కరోజే దాదాపు 53 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని.. దాంతో ఒక్కరోజే ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ నెల 11న 28 ల‌క్ష‌ల మంది, 12న 28 ల‌క్ష‌ల మంది, 13న 31 ల‌క్ష‌ల మంది మహిళలు ఉచిత ప్ర‌యాణాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. దీంతో ఇప్పటివరకు మ‌హిళ‌ల‌కు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటిన‌ట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఆర్టీసీకి మస్తు ఆమ్దాని వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News