రైలు, రోడ్డు మార్గాలకు తప్పని ఇక్కట్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారత వ్యాప్తంగా వరుసగా మూడవ రోజు మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చలిగాలుల తీవ్రత పెరిగి పారవర్శక స్థాయి పడిపోయింది. దీంతో 160కి పైగా విమానాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 128 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా 33 విమానాలు రద్దయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పారదర్శక స్థాయి 50 మీటర్లు(164 అడుగులు) ఉన్నట్లు వాతావకఱ అధికారులు తెలిపారు.
ఈ వారాంతం వరకు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగవచ్చని వారు అంచనా వేశారు. న్యూఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ శీతాకాలంలో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో పారదర్శక స్థాయి పడిపోయి దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో దాదాపు 500 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా 87 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆగ్రహంతో విమాన ప్రయాణికులు ఎయిర్‌లైన్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు టర్మాక్‌పైనే భోజనం చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కాగా..పారదర్శక స్థాయి తక్కువ ఉన్నప్పటికీ వామానం దిగడానికి వీలుకల్పించే క్యాట్ 3 నావిగేషన్ వ్యవస్థతో కూడిన అదనపు రన్‌వేను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి సోమవారం ప్రకటించారు. ఇలాఉండగా..ఉత్తర భారతంలోని సింధూ-గంగా మైదాన ప్రాంతాలలో దట్టమైన పొగ మంచు పేరుకుపోయిందని, దీని కారణంగా పారదర్శక స్థాయి బాగా పడిపోయి రోడ్డు, రైలు రవాణాకు అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు దట్టమైన పొగ కమ్మేసిన ఉపగ్రహ దృశ్యాలు వెలువడ్డాయి. పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చే దాదాపు 30 విమానాలు ఆలస్యంగా చేరుకున్నట్లు రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. బంగళవారం ఉదయం 5.30 గంటలకు వారణాసి, ఆగ్రా, గ్వాలియర్, జమ్మూ, పఠాన్‌కోట్, చండీగఢ్‌లో పారదర్శక స్థాయి సున్నా ఉండగా గయలో 30 మీటర్లు, ప్రయాగ్‌రాజ్, తేజ్‌పూర్‌లో 50 మీటర్లు, అగర్తలలో 100 మీటర్లు, అమృత్‌సర్‌లో 200 మీటర్లు, గోరఖ్‌పూర్‌లో 500 మీటర్లు ఉంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న పాలం వాతావరణ కేంద్ర వద్ద పారదర్శక స్థాయి 50 మీటర్లు ఉంది.