Friday, December 20, 2024

500 ఏళ్ల నిరీక్షణ తరువాత నిర్మాణమైన రామాలయం

- Advertisement -
- Advertisement -

ఆలయ ప్రతిష్ఠ పై విపక్షాలు విమర్శలు మానుకోవాలి : అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ : 500 ఏళ్ల నిరీక్షణ తరువాత అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిందని, ఈ ఆలయ ప్రతిష్ఠపై విపక్షాలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆపాలని కేంద్ర మంత్రి, సీనియర్ బిజేపి నేత అనురాగ్ ఠాకూర్ మంగళవారం విపక్షాలపై ధ్వజమెత్తారు. కన్నాట్ లోని హనుమాన్ మందిర్ ఆవరణలో మంగళవారం ఠాకూర్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠకు ముందుగా స్థానిక ఆలయాలను పరిశభ్రం చేసే ప్రచారోద్యమాన్ని బీజేపీ చేపట్టింది.

ఈ ప్రచారోద్యమంలో భాగంగా హనుమాన్ మందిర్‌ను పరిశుభ్రం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయ సంఘటనగా మారుస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన దృష్టికి తీసుకురాగా ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఆలయ నిర్మాణం పూర్తి అయిందని కొందరు, ప్రాణ ప్రతిష్టకు కొందరు బాధపడుతూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఠాకూర్ విమర్శించారు. జనవరి 22న ప్రతిష్ఠ కాగానే భక్తుల కోసం రామాలయం తలుపులు తెరవడమౌతుందని, దర్శనానికి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు.

రామాలయ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని, మొదట బాబ్రీ మసీదును తిరిగి నిర్మిస్తామని చెప్పిందని, తరువాత లాయర్లను పంపి ఆలయ నిర్మాణం ఆలస్యం అయ్యేలా ప్రయత్నించిందన్నారు. ఆలయ ప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదని ఆరోపించిన కాంగ్రెస్, తీరా ఆహ్వానం అందాక హాజరు కాలేమని లేనిపోని సాకులు చెబుతోందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కూడా అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.

ఢిల్లీలో ఆలయ పూజార్లను ఆప్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఈ నాయకులే రాజకీయాల్లోకి వచ్చే ముందు అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తామన్నారని, కానీ అలా చేయలేదు సరికదా చాలా అవినీతి ప్రభుత్వాన్ని అందించారని, వారి డిప్యూటీ సిఎం, మంత్రులు, ఎంపీలు జైళ్లలో ఉన్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News