Friday, January 10, 2025

ఏపి పిసిసి చీఫ్‌గా వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్. షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసి ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. సోమవారం ఏపి పిసిసికి గిడుగు రుద్ర రాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిల నియామకం జరిగిపోయింది. కాంగ్రెస్‌లో చేరిన 15 రోజుల్లోనే ఏపి కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు దక్కాయి.

షర్మిల తండ్రి వైఎస్. రాజశేఖర్‌ రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్. షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో ఏపిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలపడనుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News