Friday, December 20, 2024

ఎయిర్‌పోర్టు టర్మాక్‌పైనే ప్రయాణికుల భోజనం

- Advertisement -
- Advertisement -

విమానం దారిమళ్లింపుతో అవస్థలు

న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే టర్మాక్‌పై సేదదీరుతూ ప్రయాణికులు భోజనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఎక్స్(పూర్వ ట్విట్టర్)లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఇండిగో6ఇలో ప్రయాణిస్తున్న నిస్సహాయ ప్రయాణికులకు ఈ విభిన్నమైన అనుభవాన్ని కల్పించినందుకు అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయలేదని ఆశిస్తున్నాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇండిగో విమానం పక్కనే టర్మాక్‌పై కూర్చుని ప్రయాణికులు భోజనం చేసినట్లు ఒక నెటిజన కామెంట్ చేశాడు. జనవరి 14న 12 నుంచి 18 గంటలపాటు ఆలస్యంగా గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానాన్ని ముంబైకు మళ్లించినట్లు మరో నెటిజన్ తెలిపాడు. ఎయిర్‌పోర్టు టర్మాక్‌పై కూర్చున్న కొందరు ప్రయాణికులు భోజనం చేస్తుండగా మరి కొందరు ప్రయాణికులు ఇండిగో విమానం పక్కనే సెల్‌ఫోన్‌లు చూసుకుంటూ సేదతీరడాన్ని వీడియోలో చూడవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News