Monday, December 23, 2024

వంటనూనెలపై తగ్గించిన దిగుమతి పన్ను కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

మొలాసిస్‌పై 50 శాతం ఎగుమతి సుంకం: ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ: ఆల్కహాల్ ఉత్పత్తి కోసం వినియోగించే చెరుకు నుంచి వచ్చే మొలాసిస్ ఎగుమతులపై ప్రభుత్వం 50 శాతం పన్ను విధించింది. ఎగుమతిపై సుంకం విధింపు ఈ నెల 18 నుంచి అమల్లోకి రానుంది. చక్కెర శుద్ధి లేదా వెలికితీ నుంచి ఈ మొలాసిస్ వస్తుంది, వీటి ఎగుమతులపై 50 శాతం పన్ను అమలు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. మరో నోటిఫికేషన్‌లో ముడి చమురు, రిఫైన్డ్ వంట నూనెలు అయిన పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ దిగుమతులపై ప్రస్తుత సుంకం రేట్ల రాయితీని 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తూ గతేడాది జూన్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ ముఖ్యంగా ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల నుంచి పామ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా నుంచి సోయాబీన్‌తో పాటు చిన్న పరిమాణంలో క్రూడ్ సాఫ్ట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఇక ఉక్రెయిన్, రష్యా దేశాల నుండి సన్‌ఫ్లప్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News