Saturday, January 18, 2025

కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో బుధ‌వారం తెల్ల‌వారుజామున ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తన మంటలు చెలరేగుతుండడంతో పరిశ్రమ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుకుమున్నాయి. ప్రమాదంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఫైరిజంన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News