- Advertisement -
యువ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద భారత నంబర్ వన్ చెస్ ఆటగాడిగా నిలిచాడు. ఇంతవరకూ ఈ స్థానంలో విశ్వనాథన్ ఆనంద్ ఉండేవాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన నాలుగో రౌండ్ పోటీలో చైనాకు చెందిన ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు డింగ్ లిరెన్ ను ఓడించడంతో ప్రజ్ఞానందకు భారత నంబర్ వన్ స్థానం లభించింది. ఈ ర్యాంక్ ను అతను సాధించడం ఇదే ప్రథమం.
- Advertisement -