Friday, December 20, 2024

ధోనిపై పరువు నష్టం కేసు

- Advertisement -
- Advertisement -

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ తనను 15 కోట్ల రూపాయల మేర మోసగించిందంటూ ధోనీ ఇటీవల కేసు వేశారు. అయితే ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ భాగస్వాములైన మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ తాజాగా ధోనీపై పరువు నష్టం కేసు పెట్టారు.

తమ కేసు కోర్టు పరిధిలో ఉండగా ధోనీ తమపై బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేశారంటూ వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు ధోని నష్టపరిహారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ధోనితో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ 2017లో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా సంస్థకు వచ్చే ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో ధోనికి వాటా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధిలో అకాడమీలు ఏర్పాటు చేయడంలో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ విఫలమైంది. దాంతో ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగారు. ఆ తర్వాత తనకు రావలసిన డబ్బు గురించి కేసు వేశారు.

అయితే ధోని ఆరోపణలు అవాస్తవాలంటూ దివాకర్ వాదిస్తున్నారు. పైగా కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ధోని తరఫు న్యాయవాది మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News