Friday, December 20, 2024

మార్కెట్లోకి టాటా పంచ్ ఇవి కారు!

- Advertisement -
- Advertisement -

టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. టాటా పంచ్ ఇవి పేరుతో మార్కెట్లోకి వచ్చిన దీని ధర 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇదే మోడల్ లో టాప్ ఎండ్ వేరియంట్ ధర 14.49 లక్షల రూపాయలు. జనవరి 22నుంచి కారు డెలివరీలు మొదలవుతాయి.

టాటా పంచ్ ఇవి.. స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ లో 25కేడబ్ల్యుహెచ్ బ్యాటరీ, లాంగ్ రేంజ్ వేరియంట్ లో 35 కేడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ సింగిల్ చార్జితో 315 కి.మీ, లాంగ్ రేంజ్ మోడల్ కారు 421 కి.మీ ప్రయాణిస్తాయి. టాటా సంస్థ అభివృద్ధి చేసిన అడ్వాన్సుడ్ ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ ఇవిని రూపొందించడం విశేషం.

టాటా పంచ్ ఇవిలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా వ్యవస్థ, బ్లైండ్ స్పాట్ మానిటర్, 10.25 అంగుళాల టచ్ ఇన్ఫొటైన్ మెంట్ వ్యవస్థ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News