- Advertisement -
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా రోడ్‌షోలో పాల్గొనడానికి కారులో వెళ్తుండగా జిల్లా కేంద్రం రెకాంగ్‌పియోకు ఐదు కిమీ దూరంలో షిల్టి రోడ్డులో 600 మీటర్ల లోతులోని వాగులో కారు బోల్తాపడింది. ఇంతవరకు రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. మిగతా మృతదేహాలు కారులోఇరుక్కున్నాయి. వాటిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
మృతులు అరుణ్‌సింగ్, అభిషేక్, ఉపేంద్ర, తనూజ్‌కుమార్, సమీర్‌గా గుర్తించారు. వీరంతా కిన్నౌర్ గ్రామ నివాసులు. రెకాంగ్‌పియో లోని సుందరాంగ్ మహీంద్రా షోరూమ్ నుంచి సంగ్లాలో రోడ్‌షోకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరు ప్రయాణించిన కారు కొత్తది కావడంతో ఇంకా నంబర్ రాలేదు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీస్‌లు చెప్పారు.
- Advertisement -