- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు దాడులు చేశారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మావోల మెరుపు దాడులను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. దీంతో వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రి 7.00 గంటల నుంచి ఎదురు కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. నివురు గప్పిన నిప్పులా దండకారణ్యంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
- Advertisement -