Friday, December 20, 2024

వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చిన ఎన్‌టిఆర్‌ను ఏమీ చేయలేరు: నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్‌టిఆర్‌ను ఏమీ చేయలేరని వైసిపి ఎంఎల్ఎ కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్ టిఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్‌టిఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ తన అనుచరులకు ఆదేశించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటుడు, బాలయ్యపై వైసిపి ఎంఎల్‌ఎ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్‌టిఆర్‌ను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వారు వర్ధంతి చేస్తారా? అని నాని చురకలంటించారు. జూనియర్ ఎన్‌టిఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, బాలకృష్ణ ఆదేశాలతోనే ఎన్‌టిఆర్ ఫ్లెక్సీలు తొలగించారని నాని దుయ్యబట్టారు. ఎన్‌టిఆర్ ఫ్లెక్సీలు తొలగించడమనేది నీచాతినీచమైన చర్య అని మండిపడ్డారు. జైలుకురా కదలిరా అని చంద్రబాబుకు కోర్టు చెప్పిందని ఎద్దేవా చేశారు. ఎన్‌టిఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నాని స్పష్టం చేశారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును ఎవరూ పట్టించుకోరని, లోకేష్‌ను సిఎం చేయాలన్నదే బాబు ఆలోచని అని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News