- Advertisement -
వాతావరణం అప్‌డేట్‌ల నిమిత్తం ఐఎండి ఏర్పాటు
22న రామ్ మందిరం ప్రాణ ప్రతిష్ఠ
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా నాలుగు రోజులు ఉండగా భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆ నగరానికి, ముఖ్యమైన పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సమాచారం అందజేయడానికి ప్రత్యేక వెబ్‌పేజిని గురువారం ప్రారంభించింది. ఉష్ణోగ్రత, తేమ, గాలి తీరుతో సహా వాతావరణ కొలబద్దల సమాచారం వెబ్ పేజీలో ఉంటుంది.
హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి వివిధ ప్రధాన భాషల్లో ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నో, న్యూఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన వాతావరణ సమాచారం వెబ్‌పేజీలో లభిస్తుంది. ఇది ఇలా ఉండగా, అయోధ్యలో రామ్ మందిర్‌లో రామ్ లల్లా విగ్రహం ప్రాణ్ ప్రతిష్ఠ్ కార్యక్రమం ఈ నెల 22న జరగనున్నది.
- Advertisement -