Friday, December 20, 2024

యుపిలో చెరకు ఎఎస్‌పి క్వింటాకు రూ. 20 పెంపు

- Advertisement -
- Advertisement -

లక్నో: సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతుల మద్దతును కూడగట్టుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ఇచ్చే రాష్ట్ర సలహా ధరను(ఎఎస్‌పి) క్వింటాలుకు రూ.20 చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరకు ఎఎస్‌పిని క్వింటాలుకు రూ. 20 చొప్పున పెంచుతున్నట్లు రాష్ట్ర చక్కెర పరిశ్రమ, చెరకు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి తెలిపారు. ఈ పెంపుతో లేత రకం చెరకు కొనుగోలు ధర క్వింటాకు రూ. 370 లభిస్తుంది.

సాధారణ రకం చెరకు కొనుగోలు ధర క్వింటాకు రూ. 360 లభిస్తుందని మంత్రి తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చెరకు ఎఎస్‌పిని క్వింటాకు రూ.25 చొప్పున ఆనాటి ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయమైన, గిట్టుబాటు ధర(ఎఫ్‌ఎఫ్‌పి) కాకుండా చెరకు పండించే రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు నిర్దిష్టమైన ప్రాంతాలలో ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఎపిని నిర్ణయిస్తాయి. గత ఆరేళ్ల కాలంలో యోగి ప్రభుత్వం చెరకు కొనుగోలు ధరలను క్వింటాలుకు రూ. 55 చొప్పున పెంచినట్లు చౌదరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News