Sunday, November 24, 2024

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులతో యువతకు ఉపయోగం

- Advertisement -
- Advertisement -

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడింట్ అజారుద్దీన్

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు యువతకు ఎంతో ఉపయోగకరమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడింట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మొదటి రోజే భారీ పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన చెప్పారు. విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారు చేయడానికి అదానీ, గోద్రెజ్, జెఎస్ డబ్ల్యూ, గోది, వెబ్ వర్స్, ఆరాజెన్ లాంటి సంస్థలతో సుమారు రూ.37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడం కోసం అదానీ ముందుకు రావడం తెలంగాణ యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా యువతకు ఉపాధికల్పన కోసం పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసి మరో రెండు నెలల్లో మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా అమలు చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధిక పార్లమెంటు సీట్లను గెలుస్తామని ఆయన తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లోనే ప్రజారంజక పాలనను అందిస్తూ అన్ని వర్గాల నుంచి మన్ననలను పొందుతోందని ఆయన ప్రశంసించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News