Friday, November 22, 2024

సమృద్ధిగా ఎరువులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో యాసం గి పంటల సాగుకు సమృద్దిగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గు రువారం సచివాలయంలో మంత్రి అధికారులతో ఎరువుల నిల్వల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులను సిద్దంగా ఉంచడమే కాకుండా , గ్రామ స్థాయి వరకూ వాటిని చేర్చే ప్రణాళికను సిద్ధ్దం చేయాలని, అందుకోసం నోడల్ ఏజెన్సీ ఎరువుల కంపెనీలతో చర్చించాలన్నారు. మార్క్‌ఫెడ్ , వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ నెల 9 నుంచి లారీ డ్రైవర్ల సమ్మె కారణంగా నిర్మల్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఎరువుల పరఫరాలో జాప్యంపై స్పం దిస్తూ జిల్లా అధికారులు సకాలంలో కావాల్సిన ఎరువులు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని , రైతులకు ఎరువుల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎరువుల అవసరాలను ముందుగానే గుర్తించాలన్నారు. గత యాసంగిలో ఇదే రోజునాటికి 3.51లక్షల టన్నుల యూరి యా, 0.63లక్షల టన్నుల డిఏపి, 2.51లక్షల టన్నుల కాంప్లెక్స్ , 0.22 టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ , 0.15 లక్షల టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ ఎరువులు నిలువ వుండగా , ఈ యాసంగికి 8.59లక్షల ట న్నుల ఎరువులు నిలువ ఉంచామని అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 4.67లక్షల ట న్నుల యూరియా, 0.69లక్షల టన్నుల డిఏపి ఎ రువులు కూడా ఉన్నట్టు తెలిపారు. గత ఏడాదితోపోలిస్తే అన్ని రకాల ఎరువులు ఈ ఏడాది 22 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. యూరియా కూడా ఈ ఏడాది 33శాతం అధికంగా ఉన్నట్టు వివరించారు.

రైతులు ఎటువంటి ఆందోళను గురికావద్దని తెలిపారు. మంత్రి తుమ్మల ఇదే సందర్భంగా డిసిసిబి , పిఏసిలలో పాత రుణాలు , వాటి బకాయిల పరిస్థిని సమీక్షించారు. మొండి బకాయి లు, నాన్ అగ్రికల్చర్ రుణాలు తీర్చిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అదేశించారు. రుణాలు నియమాల ప్రకారం ఆమోదించాలన్నారు. మొండి బకాయిల వసూళ్లలో కఠినమైన చర్యలు తీసుకోవాలని టెస్‌కాబ్ ఎండిని ఆదేశించారు. పిఏసిఎస్‌లను బలోపేతం చేయాలన్నారు. వారం రోజుల్లో రుణాలు తీర్చని వారిపైన, రుణాల రికీవరిలో అలసత్వం చూపే అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో అగ్రికల్చర్ డైరెక్టర్ బి. గోపి, మార్క్‌ఫెడ్ ఎండి సిహెచ్ సత్యనారాయణ , ఆగ్రోస్ ఎండి రాములు , టెస్‌కాస్ ఎండి మురళీధర్‌తోపాటు క్రిబ్‌కో ఏపిఎల్, ఎన్‌ఎఫ్‌సిల్, కోరమాండల్,ఆర్‌సిఎఫ్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News