- Advertisement -
హైదరాబాద్: గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమణ అనే యువకుడు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించాలంటూ బాలిక వెంటపడ్డాడు. బాలిక పలుమార్లు అతడి ప్రేమను నిరాకరించింది. గత రాత్రి ట్యూషన్‌లో పదో తరగతి బాలికపై రమణ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ట్యూషన్ టీచర్‌పై కూడా అతడు దాడి చేసి పారిపోయాడు. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ప్రేమను నిరాకరించడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. అక్కడి నుంచి నిందితుడు రమణ విద్యానగర్ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
- Advertisement -