Friday, November 22, 2024

ఇవాళ్టి నుంచి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం… భారతే ఫేవరేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ నుంచి నాలుగు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు 41 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 11న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఐసిసి మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హవా కొనుసాగినట్లే అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఐదు సార్లు టీమిండియా విజేతగా నిలిచింది. 1988 నుంచి 14 సార్లు అండర్ 19 వన్డే వరల్డ్ కప్ జరిగింది. పంజాబ్ కుర్రాడు సహారన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. తెలంగాణ నుంచి అరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ అండర్ 19 జట్టులో ఉన్నారు. అండర్ 19 మ్యాచ్‌లలో సత్తా చాటి టీమిండియాలో మెరిశారు. యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు అండర్ 19 నుంచి టీమిండియాలోకి వచ్చారు.

గ్రూప్-ఎ
భారత్
బంగ్లాదేశ్
ఐర్లాండ్
యుఎస్‌ఎ

గ్రూప్-బి
ఇంగ్లాండ్
దక్షిణాఫ్రికా
వెస్టిండీస్
స్కాంట్లాండ్

గ్రూప్-సి
ఆస్ట్రేలియా
శ్రీలంక
జింబాబ్వే
నమీబియా

గ్రూప్-డి
న్యూజిలాండ్
పాకిస్తాన్
అప్ఘానిస్థాన్
నేపాల్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News