హైదరాబాద్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రూ.700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాహుబలి 2 తరువాత ప్రభాస్ సలార్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా జనవరి 20 తేదీన ఓటిటిలోకి రానుంది. ఓటిటి వేధిదికగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నారు. సలార్ కథ ఏంటంటే… ఖాన్సార్ అనే సమ్రాజ్యం ఉంటుంది. ఈ సమ్రాజ్యానికి రాజ మన్నార్ అనే కర్త(జగపతి బాబు) పాలించేవాడు. ఖాన్సార్ రాజ్యంలో కొన్ని ప్రాంతాలుగా విభజించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కోక్కరు దొరగా వ్యవహరిస్తారు. కర్త కూర్చీ కోసం కుతంత్రాలు జరుగుతుంటాయి.
తాను బతికి ఉన్నప్పుడు తన కుమారుడు వరద రాజమన్నార్ దొరగా చూడలనేది తన కోరక అని రాజ మన్నార్ పలుమార్లు చెబుతాడు. ఆయన కొన్ని రోజులు తన ఖాన్సార్‌ను వదిలి వచ్చేలోపు కుట్రలు కుతంత్రాలు మొదలవుతాయి. కుతంత్రాలు తారా స్థాయికి చేరుకోవడంతో వరద రాజమన్నార్‌ను చంపాలని దొరలు నిర్ణయం తీసుకుంటారు. దొరలంతా తమ సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటారు. వరద తన రక్షించేందుకు స్నేహితుడు దేవాను( ప్రభాస్ ) పిలుస్తాడు. తన ప్రాణ స్నేహితుడు కోసం దేవా ఏం చేశాడు, ప్రభాస్‌కు సలార్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై సినిమా ఉంటుంది. 20 సంవత్సరాల పలు తన తల్లిని దాస్తూ గ్రామాలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని కథలో చూడాల్సి ఉంది. దేవా జీవితంలోకి హీరోయిన్ శృతిహాసన్(ఆధ్య) ఎలా వచ్చింది అనే అనేది సినిమా చూస్తూ తెలుస్తుంది.