- Advertisement -
7 సీట్లకు పోటీ చేయనున్న ఆర్‌ఎల్‌డి
లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తాము పొత్తు కుదుర్చుకున్నట్లు సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి) శుక్రవారం ప్రకటించాయి. తమ అభ్యర్థుల కోసం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఏడు సీట్లను ఎస్‌పి వదలివేయగలదని ఆర్‌ఎల్‌డి వెల్లడించింది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తాము పొత్తు కుదుర్చుకున్నట్లు ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు జయంత్ చౌదరి సోషల్ మీడియాలో ప్రకటించారు.
‘ఆర్‌ఎల్‌డి, ఎస్‌పి పొత్తుపై ప్రతి ఒక్కరికీ అభినందనలు. విజయం కోసం మనం అంతా కలుద్దాం’ అని అఖిలేశ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను జయంత్ చౌదరి తిరిగి ట్వీట్ చేశారు. ఇద్దరు నేతల కరచాలనం ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే, ఆర్‌ఎల్‌డి పోటీ చేసే సీట్ల వివరాలను పార్టీ ప్రతినిధి వెల్లడించలేదు.
- Advertisement -