Monday, November 18, 2024

శ్రీరాముడు ఒక్క ఆలయానికే పరిమితమా ?: ఫరూఖ్ అబ్దులా

- Advertisement -
- Advertisement -

జమ్మూ : అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠ ఉత్సవంపై చర్చను జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా శుక్రవారం లేవదీశారు. శ్రీరాముడు ఒక్క ఆలయానికే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ అబ్దుల్లా జమ్మూలో విలేకరులతో మాట్లాడుతూ, శ్రీరాముడు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేకించిన దైవమా అని కూడా ప్రశ్నించారు. ‘ఏ ఒక్కరూ రాముని సంరక్షకుడు కారు’ అని ఆయన స్పష్టం చేశారు.

‘శ్రీరాముడు కేవలం ఒక ఆలయంలోనే నివసిస్తున్నారా ? రామునికి మరొక ఆశ్రయం (ఆలయం) లేదా ? ఇతర రామాలయాలు నిష్ప్రయోజనాలా ? రాముడు సర్వత్రా ఉన్నారు. ఏ రామాలయమూ లేని చోటా ఆయన ఉన్నారు. ఆయన సమస్త విశ్వానికి రాముడు’ అని డాక్టర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు. శ్రీరాముడు ఏదో ఒక తెగకు చెందినవారు కాదని, ఆయనను ‘హిందువుగా’ మాత్రమే పేర్కొనడం తప్పు అని డాక్టర్ అబ్దుల్లా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News