Monday, December 23, 2024

గాజా క్యాంపస్‌పై ఇజ్రాయెల్ దాడి..వివరణ కోరిన అమెరికా

- Advertisement -
- Advertisement -

గాజాస్ట్రిప్ : స్థానిక పాలస్తీని యూనివర్శిటీ క్యాంపస్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సేనలు (ఐడిఎఫ్) దాడికి దిగాయి. ఈ దృశ్యాలను తెలిపే వీడియో సామాజిక మాధ్యమంలో వెలువడింది. దీనిపై ఇజ్రాయెల్ వివరణను అమెరికా డిమాండ్ చేసింది. ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి వీడియో వెలువడింది. క్యాంపస్ భవవనాలు హమాస్ మిలిటెంట్ల స్థావరాలుగా ఉన్నాయనే సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి దిగిందని, ఈ క్రమంలో బాంబుల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షుల కథనంతో వార్తలు వెలువడ్డాయి. ఖాళీగా ఉన్న క్యాంపస్ భవనాలపై వైమానిక , బాంబుల దాడి జరిగిందని వెల్లడైంది. ఈవీడియో గురించి తమకు స్పష్టమైన సమాచారం లేదని, దీనిపై ఎక్కువగా స్పందించేది లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్ మిల్లర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News