Monday, December 23, 2024

అమరావతి నుంచి అయోధ్యకు 300 కిలోల కుంకుమ పత్రాలు

- Advertisement -
- Advertisement -

నాసిక్: రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం మహారాష్ట్రలోని అమరావతి నుంచి అయోధ్యకు 300 కిలోల కుంకుమ పత్రాలను పంపిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువులు రాజేశ్వర్ మౌళి, జితేంద్రనాథ్ మహరాజ్‌లు ఈ పత్రాలను అయోధ్యకు తీసుకెళుతున్నారు. వారు అయోధ్యకు బయలుదేరడాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎంపి నవనీత్ రాణా హాజరయ్యారు. భారత దేశంలో కుంకుమ పత్రాలకు సామాజిక,మతపరమైన ప్రాధాన్యత ఎంతో ఉంది.

భోపాల్: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర్ అలయంతో తయారు చేసిన 5 లక్షల లడ్డూలు అక్కడికి బయలుదేరాయి. ఈ లడ్డూలు తీసుకుని బయలు దేరిన అయిదు ట్రక్కులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఒక్కోటి 50 గ్రాముల బరువుండే ఈ లడ్డూలు మొత్తం 250 క్వింటాళ్ల బరువుంటాయని మహాకాళేశ్వర ఆలయ అధికారి ఒకరు చెప్పారు. అంతకు ముందు ఉజ్జయినుంచి ఈ లడ్డూలను తీసుకుని వచ్చిన అయిదు ట్రక్కులు భోపాల్‌కు చేరుకున్నాయి. అయిదు రోజుల పాటు 150 మంది ఆలయ సిబ్బందితో పాటుగా స్థానిక స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు ఈ లడ్డూల తయారీలో పాలు పంచుకున్నట్లు మహాకాళ్వేర్ ఆలయ అధికారి మూల్‌చంద్ జున్వాల్ చెప్పారు. ఆలయానికి ప్రత్యేక విభాగం ఈ లడ్డూలను తయారు చేసినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News