Monday, November 25, 2024

మదర్సాలో ఘర్షణ

- Advertisement -
- Advertisement -

బాలుడి మృతి

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మదర్సాలో వి ద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రం, ఇ స్లాంపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు గండిపేట మండలం, పుప్పాలగూడ, బయూత్ కాలనీలోని మదర్సాలో అరబిక్ నేర్చుకుంటున్నారు. మహ్మద్ సిరాజ్ అనే విద్యార్థి కొందరు విద్యార్థులు కలిసి ఉన్న ఫొటోను హింది పాటతో కలిసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

అది అసభ్యంగా ఉంది, ఫొటోలో ఉన్న విద్యార్థి మహ్మద్ రకీమ్(17) అసభ్యంగా ఉన్న పాటతో ఫొటోను ఎందుకు పెట్టావని సిరాజ్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సిరాజ్ కోపంతో రకీమ్‌పై మె డ, మొఖంపై దాడి చేశాడు. దీంతో రకీమ్ కిం దపడిపోయాడు, వెంటనే అక్కడ ఉన్న వారు గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News