Sunday, November 24, 2024

అయోధ్యకు చేరుకున్న భారీ లడ్డూ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో తయారు చేసిన భారీ లడ్డూ అయోధ్యకు చేరుకుంది. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా 1265 కేజీల బ‌రువు ఉన్న భారీ లడ్డును తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ లడ్డూ శనివారం తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. క్యాట‌రింగ్ వ్యాపారంపై, త‌న ఫ్యామిలీపై రాముడి ఆశీస్సులు ఉన్నాయ‌ని, బ్ర‌తికి ఉన్నంత కాలం రాముడి కోసం ప్ర‌తి రోజు ఒక కేజీ ల‌డ్డూ త‌యారు చేయాల‌ని నిర్ణయించుకున్నట్లు నాగ‌భూష‌ణం తెలిపారు. తాము త‌యారు చేసిన ల‌డ్డూలు నెల రోజులు వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటాయ‌ని తెలిపారు.

ఈనెల 17వ తేదీన హైద‌రాబాద్ తాడుబంద్ లోని శ్రీ రామాంజనేయస్వామి దేవాలయం నుంచి శోభాయాత్రతో ప్ర‌త్యేక వాహ‌నంలో లడ్డూ అయోధ్యకు బ‌య‌లుదేరింది. ఈ లడ్డూ యాత్రను హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.ఈ లడ్డూను తీసుకువ‌చ్చేందుకు వాహ‌నానికి ప్ర‌త్యేక స‌స్పెన్ష‌న్ చేయించిన‌ట్లు నాగభూషణం చెప్పారు. వాహనానికి గ్లాసు, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1265 కేజీలో ఈ భారీ లడ్డూ తయారికి 350 కేజీల శ‌న‌గ పిండి, 700 కేజీల చ‌క్క‌ర‌, 40 కిలోల కాజూ, 25కేజీల బాదాం, 4 కిలోల కిస్‌మిస్‌, 40 కిలోల నెయ్యి, 15 కిలోల నూనె, కుంకుమ పువ్వు, ప‌చ్చ క‌ర్పూరాన్ని ఉపయోగించినట్లు ఆయ‌న వివరించారు.

కాగా, అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు అంశాల్లో పాలుపంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. అయోధ్య రామ మందిరానికి తలుపులను మన హైదరాబాద్ లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీరాముడికి భారీ లడ్డూ కూడా హైదరాబాద్ లో తయారు చేయడం తెలంగాణకు గుర్తింపునిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News