Monday, December 23, 2024

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఓటీటీ హక్కులు జీ5కి?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీకోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ పిక్చర్ షూటింగ్ జరుగుతోంది. గత ఏడాది దీపావళికి రిలీజ్ చేద్దామనుకున్నా, షూటింగ్ పార్ట్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ ఏడాది వేసవిలో విడుదల చేస్తారని అభిమానులు భావించారు. అయితే ఇటీవల సెప్టెంబర్లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత దిల్ రాజు చెప్పారు.

కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అంజలీ, ఎస్.జె.సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని తదితరులు కూడా ఉన్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ గేమ్ చేంజర్ తోపాటు భారతీయుడు 2 కూడా చేస్తున్నారు. అందుకే గేమ్ చేంజర్ ఆలస్యమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే… ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ హక్కులను జి5 భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందట. ఈ మూవీ కోసం జీ5 ఏకంగా 250 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News