Monday, December 23, 2024

కరెంటు బిల్లులు కట్టొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెట్టడం కాదు రేవంత్… ముందుగా వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చురకలంటించారు. సిఎం రేవంత్ రెడ్డి వంటి వారిని బిఆర్‌ఎస్ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు. 25 ఏళ్లుగా నిలబడి, నీలాంటి వాళ్లను ఎంతో మందిని మట్టికరిపించిందని, లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బిజెపిలు కలిసిపోతాయని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేగా మారుతారని, రేవంత్ రక్తం అంతా బిజెపిదేనని, ఇక్కడ చోటా మోడీగా మారారని కెటిఆర్ ధ్వజమెత్తారు. అదానీ-రేవంత్ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దని కోరారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి, టెన్ జన్‌పథ్‌కు పంపాలన్నారు. ప్రతి ఒక్క మహిళకు నెలకు రూ.2500 వెంటనే ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను వదిలిపెట్టేదేలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News