Friday, December 20, 2024

ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె

- Advertisement -
- Advertisement -

సాధారణ పౌర జీవనం స్తంభన
23 ఏళ్ల గ్రామీణ వాలంటీర్ హత్యకు నిరసన
సమ్మెకు పిలుపు ఇచ్చిన జెఎసి

ఇంఫాల్ : మణిపూర్‌లోని ఇంఫాల్ లోయలో 48 గంటల సమ్మె కారణంగా శనివారం సాధారణ పౌర జీవనానికి అంతరాయం వాటిల్లింది. ఇటీవల 23 ఏళ్ల గ్రామీణ వాలంటీర్ హత్యకు నిరసనగా సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) ఈ సమ్కెకు పిలుపు ఇచ్చింది. పౌర సమాజ సంస్థల నాయకులతో కూడిన జెఎసి పిటుపు మేరకు శనివారం ఉదయం 5 గంటలకు సమ్మె మొదలైంది.

మణిపూర్ కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ నెల 17న రెండు వర్గాల మధ్య తుపాకులతో సాగిన పోరులో గ్రామీణ వాలంటీర్ హతుడు అయ్యాడు. ఇంఫాల్ లోయలో మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూసివేశారు. ప్రజా రవాణా వాహనాలు నడవలేదు. కార్యాలయాల్లో హాజరు శాతం కూడా పలచగా ఉన్నది. ఇంత వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనా చోటు చేసుకోలేదని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. అయితే, పర్వత ప్రాంత జిల్లాల్లో సమ్మె ప్రభావం ఏమీ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News