Monday, November 25, 2024

ఎస్వీబీసీలో అయోధ్య కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: అయోధ్య శ్రీరామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో, అదేవిధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.

ఎస్వీబీసీ తెలుగు ఛానల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుండి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుండి జరిగే కార్యక్రమాలను శ్రీవారి కల్యాణం అనంతరం తిరిగి ప్రసారం చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News