Monday, December 23, 2024

ఢిలీ ఎయిమ్స్ ఆసుపత్రికి రేపు సగం సెలవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :  సోమవారం (22న) సగం రోజు సెలవు పాటించనున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీ శనివారం ప్రకటించింది. అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం జరుపుకోవడానికై ఆ రోజు మధ్యాహ్నం 2.30 వరకు ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే, కీలక సర్వీసులు అన్నీ మామూలుగా పని చేస్తాయని ఆసుపత్రి పాలన అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను మార్పులు చేస్తున్నటుల, రోగులు ఎవరైనా వచ్చినట్లయితే వారికి వసతి కల్పనకు ఆసుపత్రి ప్రయత్నించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. సాయంత్రం ఒపిడిలు పని చేస్తాయని ఆయన తెలియజేశారు. 22న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు సగం రోజు సెలవుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా ఎయిమ్స్ ఈ విషయం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News