Monday, December 23, 2024

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

గద్వాల : గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఎర్రవల్లి చౌరస్తాకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొంది. గద్వాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ యజమాని, వైద్యుడి కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ (23), పవన్‌కుమార్ (28), ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందగా గోవర్ధన్, నవీన్, మహబూబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారందరూ గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. బర్త్‌డే వేడుకల అనంతరం ఇందులో ఒక వ్యక్తిని పెబ్బేరులో దింపేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డిఎస్‌పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతదేహాలను గద్వాల మార్చురీకి తరలించామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News