Sunday, November 24, 2024

మీ హామీల మాటేమిటి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారారని విమర్శించారు. తెలంగా ణ భవన్‌లో శనివారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశానికి బిఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీశ్ రావు, సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, ప ద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లండన్‌లో సిఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాం టి నాయకులను టిఆర్‌ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని.. అలాంటి వాళ్లందరూ మఖలో పుట్టి పుబ్బలో పోయేవాళ్లేనని ఘాటు వ్యా ఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ రెండున్నర దశాబ్దా లు పార్టీ నిలబడి, రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లను మట్టికరిపించిందని పేర్కొన్నారు. తెలంగాణ జెండాను ఎం దుకు బొంద పెడుతావ్ … తెలంగాణ తెచ్చినందుకా..? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా..? అని ప్రశ్నించారు. మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రేవంత్ కాంగ్రెస్ ఎక్‌నాథ్ షిండేగా మారతారు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిజెపి పా ర్టీలు కలిసిపోతాయని, రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతారని కెటిఆర్ పేర్కొన్నారు. రేవంత్ రక్తం అంతా బిజెపిదే అని, రేవంత్ రెడ్డి ఇక్కడ చోటా మోడీగా మారిండు అని విమర్శించారు. గతంలో ఆదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆదానీ కోసం వెంటపడుతున్నారని అన్నా రు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానీతో అలయ్ బలయ్ చేసుకున్నారని, అదానీతో రేవంత్ రెడ్డి ఒ ప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలని డిమాం డ్ చేశారు. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, రేవంత్ రెడ్డి ఆదానీ కోసం అర్రులు చేస్తున్నారని విమర్శించారు.
గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు
ఈ జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ కట్టవద్దని కెటిఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని అన్నారు. అంతే కాకుండా మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని చెప్పారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమం త్రి మాటలను చూపించాలని తెలిపారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పారని, కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, టెన్ జన్ పథ్‌కు పంపించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయా లి. ఈ పథకంలో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి
బిజెపితో బిఆర్‌ఎస్‌కు ఏరోజూ పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదని కెటిఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపిగా గెలుపొంది, కేంద్రమంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఈ ఐదేండ్లల్లో ఏం చేశారో చెప్పాలని ఆక్షేపించారు. కెసిఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కిషన్ రెడ్డి మాత్రం సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో లిప్ట్‌లను జాతికి అకింతం చేశారని, ఇదే అయన చేసిన అతిపెద్ద పని అని ఎద్దేవా చేశారు. కెసిఅర్ అధ్వర్యంలో 36 ప్లై ఓవర్లు కడితే ఉప్పల్, అంబర్‌పేట ప్లై ఓవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తేశారని విమర్శించారు.
పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు
శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి కెటిఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చి కెసిఆర్ నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బిజెపిని అడ్డుకున్నది బిఆర్‌ఎస్ పార్టీనే అని వెల్లడించారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతన్నలకు రైతుబంధు అందడం లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు …420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వివిధ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వెంటాడతామని కెటిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఓడినా గెలిచినా బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమే అని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News