- Advertisement -
ముగ్గురు మావోయిస్టులు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో మరోసారి ఛత్తీస్‌గడ్ దద్దరిల్లింది. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. శనివారం బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పోలీసుల నుంచి తప్పించుకుని అటవీ ప్రాంతం లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -