- Advertisement -
ప్రతి ఏటా శ్రీరామ నవమికి అయోధ్య రాముడికి ప్రకృతిసిద్ధంగా సూర్యతిలకం అద్దే వ్యవస్థను నిపుణులు రూపొందించారు. శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలనుంచి ఆరు నిమిషాలపాటు సూర్యకిరణాలు నేరుగా అయోధ్య ఆలయంలోని రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ (సిబిఆర్ఐ) సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఎం) సహాయంతో ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.
సూర్యకిరణాలు అయోధ్య ఆలయంలోని మూడో అంతస్తునుంచి గర్భగుడిలోని రాములవారి విగ్రహం నుదిటిపై ప్రసరించేలా అద్దాలు, గేర్ బాక్సులు, కటకాలు అమర్చారు. దీనినే సూర్య తిలకం అని వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఎక్కడా ఉక్కు, బ్యాటరీలు, కరెంటు వాడకపోవడం విశేషం. ఈ వ్యవస్థను ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఆవిష్కరిస్తారు.
- Advertisement -