విహార యాత్రకు అని చెప్పి తన భార్యను గోవాకు తీసుకెళ్లి సముద్రంలోకి తోసేసి హత్య చేశాడో దుర్మార్గపు భర్త. తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందని కట్టుకథ అల్లాడు. అయితే, సముద్రంలో తన భార్యను తోస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో భర్తే నిందితుడని తేలడయంతో ఊసలు లెక్కపెడుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన గౌరవ్ కతియార్, దీక్షా గాంగ్వార్ లు పెళ్లి చేసుకున్నారు. గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న గౌరవ్.. పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గౌరవ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తన భార్య దీక్షా కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తన భార్యను వదిలించుకునేందుకు సిద్దమైన గౌరవ్.. ఆమెను గోవాలోని ఓ బీచ్ కు తీసుకెళ్లి ఆమెపై దాడి చేసి సముద్రంలోకి తీసేసి హత్య చేశాడు. ప్రమాదవశాత్తు తన భార్య సముద్రంలో పడిపోయిందని చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు వీడియో లబించడంతో భర్తే హంతకుడని నిర్ధారించిన పోలీసులు గౌరవ్ ను అరెస్టు చేశారు.