Sunday, November 24, 2024

కూలిన మొరాకో విమానం

- Advertisement -
- Advertisement -

మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం పర్వత ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. చిన్నవిమానం కూలినట్లు అఫ్గాన్ వార్తా సంస్థ వెల్లడించింది. బదాక్షన్ ప్రావిన్స్ లో చిన్న విమానం కుప్పకూలినట్లు సమాచారం. చిన్న విమానం కూలినట్లు అఫ్గాన్ సమాచారం శాఖ ధృవీకరించింది. మొరాకో రిజిస్టర్డ్ ఎయిర్ క్రాప్ట్ కూలినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) వెల్లడించింది. కూలింది భారత విమానం కాదని డిజిసిఎ ధృతీకరించింది. ఎయిర్ క్రాఫ్ట్ కూలిన వార్తలపై భారత పౌరవిమానయాన శాఖ వివరణ ఇచ్చింది. భారత్ కు చెందిన ఏ విమానం కూలలేదని పౌర విమానయాన శాఖ తెలిపింది. డీఎఫ్-10 ఎయిర్ క్రాఫ్ట్ కూలినట్లు తెలిపింది. కూలిన విమానం మొరాకోలో రిజిస్టర్ట్ అయ్యిందని భారత విమానయాన శాఖ తెలిపింది. థాయ్ లాండ్ నుంచి మొరాకోకు డీఎఫ్-10 బయలుదేరిందని స్పష్టం చేసింది.

రష్యా విమానం అదృశ్యమైనట్లు రష్యా ఏవియేషన్ విభాగం వెల్లడించింది. నిన్న సాయంత్రం నుంచి విమానం రాడార్ కు అందుబాటులో లేదని రష్యా తెలిపింది. అఫ్గానిస్థాన్ మీదగా వెళ్తుండగా రాడార్ కు అందుబాటులోకి రాలేదని రష్యా వెల్లడించింది. రష్యా రిజిస్టర్డ్ విమానంలో ఆరుగురు ఉన్నట్లు రష్యా వెల్లడించింది. విమానం భారత్, ఉజ్జెకిస్థాన్ మీదగా మాస్కో రావాల్సి ఉందని రష్యా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News