Monday, December 23, 2024

బొడిగె గాలన్న మృతి తీరని లోటు: డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మాజీ పీపుల్స్ వార్ నేత, తెలంగాణ ఉద్యమకారులు గాలన్న మృతి తీరని లోటని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లిలో బొడిగె శోభ కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ గాలన్న చిన్నతనం నుంచే పేద ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ, వామపక్ష ఉద్యమాలలో పనిచేశారని గుర్తుచేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గాలన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పరామర్శించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, మహిళా కన్వీనర్ అక్కనపల్లి శిరీష,నార్త్ జోన్ రాష్ట్ర కన్వీనర్ జన్ను స్వరూప, జిల్లా అధ్యక్షులు మేకల రవీందర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాళి తిరుపతి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News