- Advertisement -
బెంగళూరు : అయోధ్య రామాలయం దివి నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుంది. దీనిని తెలియచేసే ఓ ఉపగ్రహ చిత్తరువును ఇస్రో ఇప్పుడు వెలువరించింది. ఇస్రో అనుబంధమైన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌సిసి) ఈ శాటిలైట్ ఇమేజ్‌ను సేకరించి, నెట్‌లో అందరికి పరిచయం చేసింది. సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ నుంచి అయోధ్య ఆలయాన్ని గడిచిన సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన క్లిక్ మన్పించారు. రామాలయం, దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటి పలు అయోధ్య అంతర్భాగాలు అల్లంతదూరంలో ఏ విధంగా ఉన్నాయనేది ఈ ఉపగ్రహ చిత్తరువులతో వెల్లడైంది.
- Advertisement -