Tuesday, December 3, 2024

కంటైనర్ ఢీకొని తల్లి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కాగజ్‌నగర్ మండలం, భట్‌పల్లికి చెందిన సర్వర్, భార్య షహారభాను (35), కుమారుడు షేక్ అసిఫ్ (16)తో కలిసి ఆసిఫాబాద్ మండలం, చిర్రకుంటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆసిఫాబాద్ అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపైకి వెళ్తున్న క్రమంలో రెబ్బెన నుండి వస్తున్న కంటైనర్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లి అగింది.

ఇదే సమయంలో వాంకిడి నుండి వస్తున్న లారీ కంటైనర్‌కు ఢీకొట్టింది. ఏం జరిగిందని సర్వర్ చూసేలోపు తన భార్య, కొడుకు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని, తనకు న్యాయం చేయాలని బోరున విలపించాడు. తమకు న్యాయం చేయాలని కొద్దిసేపు నేషనల్ హైవేపై మృతదేహంతో వారి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా: ఎంఎల్‌ఎ కోవ లక్ష్మి
రోడ్డు ప్రమాదంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలియగానే స్థానిక ఎంఎల్‌ఎ కోవ లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడం బాధాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి మూలమలుపు కొంత ఇబ్బందికరంగా మారిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News