- Advertisement -
హదరాబాద్: తక్కువ ధరకు దుస్తులు కుట్టేందుకు దర్జి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన కస్టమర్ టైలర్ షాపును దహనం చేసిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…లక్ష్మినగర్‌లో ఖదీర్ టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. మసూద్ అనే వ్యక్తి వచ్చి తనకు దుస్తులు కుట్టాలని కోరాడు.
దుస్తులు కుట్టేందుకు రూ.1,200 అవుతుందని ఖదీర్ కస్టమర్‌కు చెప్పాడు. అంత ఇవ్వలేనని రూ.800లకు కుట్టాని మసూద్ కోరాడు, దానికి ఖదీర్ నిరాకరించాడు. దీంతో ఆగ్రహం చెందిన మసూద్ కక్ష పెంచుకుని షాపుపై పెట్రోల్ పోసి న్పిప్పంటించడంతో మొత్తం కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -