మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
రాముడు కొలువుదీరే వేళాయే
సాకారమవుతున్న శతాబ్దాల కల
సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య
రామ్‌లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ
7వేల వరకు ఆహ్వానితులు రాక
భారీ భద్రతా ఏర్పాట్లు
అయోధ్య: శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముడి కోసం కన్న కలలు సాకారమయ్యే శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. సోమవారం జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా దేశం నలుమూలలనుంచి వచ్చిన పాధువులు, పండితులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట సమయంలో ముగుస్తుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దేశ విదేశాలనుంచి వచ్చిన 7,000 మందికి పైగా ప్రముఖులనుద్దేశించి ప్రసంగిస్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు, ఒడిశా రాష్ట్రప్రభుత్వం ఆ రోజు హాలిడే ప్రకటించడంతో లక్షలాది మంది టీవీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇందుకోసం శ్రీరాముడి జన్మస్థలిగా భావించే అయోధ్యను అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎక్కడ చూసినా ఆధ్మాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దేశంలోని వివిధ ఆలయాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ డిసి మొదలుకొని పారిస్, సిడ్నీ సహా దాదాపు అరవై దేశాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విశ్వ హిందూ పరిషత్( విహెచ్‌పి), ఆయా దేశాల్లోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ కోసం ‘యజమానులు’గా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 14 జంటలను ఎంపిక చేశారు. ఈ నెల 16న ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠకు ముందు చేపట్టాల్సిన క్రతువులు సోమవారం ముగుస్త్తాయని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలియజేశారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రామ్‌లల్లా విగ్రహాన్ని గురువారం ఆల య గర్భగుడిలో ఉంచడం జరిగింది. వస్త్రంతో కళ్లు కప్పి ఉంచిన కొత్త విగ్రహం తొలి ఇమేజిని శుక్రవారం విడుదల చేశారు.
తూర్పునుంచి ప్రవేశం
ఆలయంలోకి ప్రవేశం తూర్పువైపునుంచి, నిష్క్రమణ దక్షిణం వైపునుంచి ఉంటాయని చం పత్ రా య్ చెప్పారు. ప్రధాన ఆలయం మూడంతస్థుల్లో ( జి+2) ఉంటుంది. భక్తులు ఆలయంలోకి చేరుకోవడానికి తూర్పువైపునుం చి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సంప్రదాయ నాగర శైలిలో ని ర్మించిన ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎ త్తు ఉంటుంది. ప్రతి అంతస్థు 20 అడుగుల ఎత్తు కలిగి ఉం టుంది. ఆలయంలో మొ త్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉం టా యి. ఈ కార్యక్రమా న్ని విజయవంతం చేయడానికి కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా యి. పటణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ పో లీసు బలగాలతో పాటుగా కేంద్ర పారా మిలిటరీ దళాలను కూడా ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని ప్రతి కూడలిలోను సులభంగా తరలించడానికి వీలుగా ఉం డే బారియర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖులు తిరిగే సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు వీటిని ఉపయోగిస్తారు. రసాయనిక, బయోలాజికల్, న్యూక్లియర్ దాడులను,భూకం పాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం ఎ దుర్కోగల పలు ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దిం చారు. అలాగే ఎముకలు కొరికే చలిని దృష్టి లో ఉంచుకుని ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నగరంలోని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ప్రత్యేకించారు. ఎ యిమ్స్‌లాంటి సంస్థలనుంచి నిపుణులైన వైద్యులను కూ డా సిద్ధంగా ఉంచారు.
పుష్ప శోభ
ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రా మాలయాన్ని పూలతో అం దంగా అలంకరించారు. నగరమంతా కూడా ఆధ్మాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఎటు చూసినా ‘శుభవేళ రానే వచ్చింది’,‘ అ యోధ్య సిద్ధమయింది’ అనే పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. రా మాయణ ఘట్టాలకు చెందిన పోస్టర్లు, బానర్లు ఎక్కడ చూ సినా దర్శనమిస్తున్నాయి, ముఖ్యంగా రామ్ మార్గ్, సరయూ నదీ తీరం, లతా మంగేష్కర్ చౌక్ ప్రాంతాలు ఇలాంటి పోస్టర్ల తో చూపరులను అకట్టుకుంటున్నాయి. ఇక పట్టణంలోని వివిధప్రాంతాల్లో రామలీలా, భాగవత కథలు భజన్లు లాంటి సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరయూ నదీ తీరం లో ప్రతి రోజూ సా యంత్రం ఇచ్చేనదీ హారతిని తిలకించడానికి భక్తులు పోటెత్తుతున్నారు.సోమవారంప్రభుత్వరంగ బ్యాంకులు,బీమాసంస్థలు,ఆర్థిక సంస్థలను సగం రోజు మూ సి ఉంచుతారు. స్టాక్ మార్కెట్‌కు కూడా సెలవు ప్రకటించారు.
7వేల మందికి పైగా ఆహ్వానితులు
ప్రాణప్రతిష్ఠ కోసం ఆహ్వానితుల సంఖ్య 7,000కు పైగానే ఉన్నప్పటికీ ఎంపిక చేసిన జాబితాలో 506 మంది ఎలిస్టు వాళ్లు ఉన్నారు. ప్రాణప్రతిష్ఠకు హాజరవుతున్న వారిలో రామజన్మభూమిలో ఆలయం కోసం జరిపిన పోరాటంతో ముడిపడిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదా నీ, క్రికెటర్ సచిన్ తెండూల్కర్ .. ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న వారిలో అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు.
ప్రతిపక్షాలు దూరం
ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దాదాపు అన్ని ప్రతిపక్షాల నేతలు ఆహ్వానాన్ని తిరస్కరించడం గమనార్హం. ఇదంతా బిజెపిఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలా ఉందంటూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి రావడానికి నిరాకరించింది. అయితే జాబితాలో లేని చాలా మంది ్ల తమదైన ప్రత్యేక మార్గాల్లో అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వందలాది మంది వందలాది మైళ్ల దూరం కాలినడకన, సైకిళ్లపైన, చివరికి స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ వేళ అయోధ్య రామయ్యకు అందుతున్న కానుకలకయితే లెక్కే లేదు. సీతమ్మ పుట్టినిల్లయిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3,000 వేలకు పైగా కానుకలు పంపగా, శ్రీలంకలోని అశోక వాటికనుంచి ప్రత్యేక కానుకను పంపించారు. ఇక అత్తరు మొదలు కొని, పూలు, పళ్లు, కూరగాయాలు, బియ్య. స్వీట్లు.. ఇలా రకరకాల రూపంలో దేశం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో కానుకలు అందుతున్నాయి. అన్నిటినీ మించి అయోధ్యకు తరలి వచ్చే వేలాది మంది భక్త జనం ఆకలితో ఇబ్బంది పడకుండా చూడడానికి ఇస్కాన్ సహా పలు ధార్మిక సంఘాలు , స్థానికులు కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పా టు చేసి ఎంతమంది వచ్చినా కాదనకుండా రుచికరమైన వేడివేడి భోజనాలు వడ్డిస్తున్నారు. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జగదభిరాముడి జన్మస్థలమయిన అయో ధ్య నగరమంతా కూడా పండగ శోభ ను సంతరించుకుని లక్షలాది మంది భక్త జనానికి స్వాగతం పలుకుతోంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.