Monday, December 23, 2024

ప్రత్యేక హోదా సాధనలో జగన్,బాబు విఫలం

- Advertisement -
- Advertisement -

సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వైసిపి తాకట్టు పెట్టింది
ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, బాధ్యతల స్వీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించటంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నేత చంద్రబా బు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని పిసిసి అధినేత వైఎస్ షర్మిల అన్నారు.ఆదివారం షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆఱ్ రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి పిసిసి గా పనిచేశారన్నారు. మళ్ళీ రెండు సార్లు వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా గెలిచారని తెలిపారు. అదే పిసిసి పదవిని..ఇంతటి బాధ్యతను వైఎస్సా ర్ బిడ్డను నమ్మి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ న మ్మి ఇవ్వడం గర్వకారణం అన్నారు.

ఇంత న మ్మకాన్ని నాపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు,నమ్మకస్తులు, క్యాడర్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. ఆం ధ్ర రాష్ట్రానికి రావాలని కోరుకున్నారని, గత 5 ఏ ళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో వెఎస్‌ఆర్‌సిపి అధికారం లో ఉందని ,.అంతకు ముందు టిడిపి అధికారం లో ఉందన్నారు. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదన్నారు. రాష్ట్రం విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు , టి డిపి అప్పులు 2 లక్షలు కోట్లు ,జగన్ మోహన్ రె డ్డి చేసిన 3 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు తెలిపా రు. అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన 10 లక్ష ల కోట్లు అప్పులు అని తెలిపారు. ఇంత అప్పులు చేశారు, ఇన్ని డబ్బులు తెచ్చారు, అభివృద్ధి బూ తద్దం పెట్టీ చూసినా ఎక్కడా కనపడదన్నారు. రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా అని ప్రశ్నించారు.

ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదన్నారు. 10 ఏళ్లలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదన్నారు. పరిశ్రమలు వస్తె మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. కనీసం ఆంధ్ర లో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు అని వెల్లడించారు.అభివృద్ధి లేదు కానీ..దళితుల పై మాత్రం 100 శాతం దా డులు పెరిగాయన్నారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా,ఎక్కడ చూసి నా మైనింగ్ మాఫియా దోచుకోవడం దాచుకోవడం ఇదే పనిగా మారిందన్నారు. 10 ఏళ్లు అయ్యింది ప్రత్యేక హోదా హా మీ ఇచ్చి కాని, 10 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటి ఉద్యోగాలు వచ్చేవి.. పరిశ్రమలు వచ్చేవన్నారు. హోదా రాలేదు అనడం కంటే..పాలకులు తేలేక పోయా రు అనడం కరెక్ట్ అన్నారు. ఉత్తరంఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 500 శాతం కొత్త ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో హో దా ఇవ్వడం ద్వారా 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు.పాలకులు హోదా తేవడం లో విఫలం అయ్యారని, వాళ్లకు చేతకాలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారని గుర్తు చేశారు. 10 ఏళ్లు కా దు 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నాడని , అందుకే బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని, మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టీ ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారని గుర్తు చేశారు.

ఇక జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నాడని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతా అన్నాడని , టిడిపి మద్దతు ఇస్తే ..మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అ న్నాడని గుర్తు చేశారు. జగన్ రెడ్డి సిఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదన్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందన్నారు. ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అన్నాడని, సింగపూర్ చేస్తా అని త్రీడి గ్రాఫిక్స్ చూపించారన్నారు.జగన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడని, మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేదన్నారు. రాజధాని ఏది అంటే మనకే తెలియదన్నారు. ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని పిసిసి అధినేత్రి షర్మిల ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News