Friday, November 15, 2024

ఉత్సాహంగా ఓయూ ఉద్యోగుల క్రీడోత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బెలూన్స్ ఎగిరించి ప్రారంభించిన విసి ప్రొ. డి. రవీందర్
ఈ నెల 25 వరకు క్రీడల నిర్వహణ

మన తెలంగాణ / హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగుల క్రీడోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్న ఈ క్రీడోత్సవాలను ఉస్మానియా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ ఈ మేరకు బెలూన్లను గాలిలోకి ఎగిరించి లాంఛనంగా ప్రారంభించారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్‌డి రెడ్యా నాయక్, యూజిసి ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మల్లేషం, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రొఫెసర్ వీరయ్య, ప్రొఫెసర్ సత్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ , ఓయూ ఎన్‌జీవోస్ అసోసియేషన్ , యూఎన్‌టిఈఏ ప్రెసిడెంట్ జీ. జ్ఞానేశ్వర్, సిబ్బంది పాల్గొన్న ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో ఉస్మానియా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ మాట్లాడుతూ ఈ నాలుగు రోజుల్లోనూ క్రికెట్, వాలీబాల్ , షటిల్, టెన్నికాయిట్, క్యారమ్స్ సహా పలు క్రీడలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ఉస్మానియా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ మాట్లాడుతూ క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మనోరంజక సాధనాలలో ముఖ్యభాగమై పోయిందన్నారు. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రీడలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్రీడల్లో మన యూనివర్సిటీ విద్యార్థులు మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కాగా ఈ సందర్భంగా జి. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సోమవారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు క్రీడలు నిర్వహిస్తున్నామని, ఆయా విభాగాల్లో క్రీడాకారులు తొలి రోజు నుండీ ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. కాగా ఈ క్రీడల ప్రారంభోత్సంలో భాగంగా ప్రారంభమైన తొలి క్రికెట్ మ్యాచ్‌లో ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ టీంపైన ఓయూ ఎగ్జామ్స్ బ్రాంచ్ గెలుపొంది విజేతగా నిలిచింది.

OU2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News