- Advertisement -
షర్మిల రాకతో ఆంద్రప్రదేశ్ కు మరొక నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్లయిందని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. తిరుపతిలోని వడమాలపేటలో కాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సు క్యాంపును ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెఎస్సార్ మరణించాక ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన ఘనత కాంగ్రెస్ దని, జగన్ ను జైల్లో పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయేననీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనలో విద్య, వైద్యం, మహిళాభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
- Advertisement -