Monday, January 20, 2025

అయోధ్యకు ప్రభాస్ ఎందుకు వెళ్లలేదంటే…

- Advertisement -
- Advertisement -

ఆహ్వానం అందినా అయోధ్యకు వెళ్లలేకపోయిన సెలబ్రిటీల జాబితాలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. తమ అభిమాన నాయకుణ్నిఅయోధ్యలో చూద్దామనుకున్న ప్రభాస్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆదిపురుష్ మూవీలో రఘురాముడి పాత్ర పోషించిన ప్రభాస్ కు అయోధ్యకు రమ్మంటూ ముందే ఆహ్వానం అందింది. అయితే సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రభాస్ వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీలోనూ నటిస్తున్నారు. రాజా సాబ్ సినిమా షూటింగులో భాగంగా ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ప్రభాస్ పాల్గొంటున్నారు. రెండు చిత్రాల షూటింగ్ లో బిజీబిజీగా ఉండటంతో ప్రభాస్ అయోధ్యకు వెళ్లలేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News