Friday, November 22, 2024

కునో పార్కులో 3 చిరుత కూనల జననం..

- Advertisement -
- Advertisement -

భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో(కెఎన్‌పి) ఒక నమీబియన్ చిరుత పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. మరో చిరుత ఇటీవలనే మూడు కూనలకు జన్మనివ్వడంతో కొద్ది వారాల వ్యవధిలోనే ఆరు కూనలు జూపార్కుకు వచ్చినట్లయింది. కొత్త పులి కూనల ఆగమనాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంగళవారం వెల్లడించారు.

నమీబియన్ చిరుత ఆశా మూడు కూనలకు జన్మనిచ్చిన కొద్దివారాలలోనే మరో నమీబియన్ చిరుత జ్వాల జనవరి 20న మూడు కూనలకు జన్మనిచ్చింది. 10 నెలల వ్యవధిలో జ్వాల ప్రసవించడం ఇది రెండవసారి. గత ఏడాది మార్చిలో జ్వాల(నమీబియా పేరు సియాయ) నాలుగు కూనలకు జన్మనివ్వగా వాటిలో ఒకటి మాత్రమే బతికింది.

ఈ నెలలో కెఎన్‌పిలో ఆరు కూనలు జన్మించగా నమీబియన్ చిరుత శౌర్య జనవరి 16న మరణించింది. 2023 మార్చి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో శౌర్యతోసహా మొత్తం ఏడు పెద్ద చిరుతలు మరనించాయి. మూడు కూనలతో కలుపుకుని మొత్తం 10 చిరుతలు కెఎన్‌పిలో మరణించాయి. ప్రస్తుతం కెఎన్‌పిలో ఆరు మగ, ఏడు ఆడ, ఏడు కూనలతో కలుపుకుని మొత్తం 20 చిరుతలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News