Monday, December 23, 2024

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా భారత్

- Advertisement -
- Advertisement -

హాంకాంగ్‌ను వెనక్కినెట్టిన ఇండియా
4.33 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్

ముంబై : భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌ను వెనక్కు నెట్టి భారత్ ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీ షేర్ల మొత్తం విలువ 4.29 ట్రిలియన్ డాలర్లు కాగా, భారతీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన మొత్తం షేర్ల మార్కెట్ క్యాప్ 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అమెరికా ప్రస్తుతం 50.86 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.

దీని తర్వాత చైనా 8.44 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో రెండో స్థానంలో ఉండగా, 6.36 ట్రిలియన్ డాలర్లతో జపాన్ మూడో స్థానంలో ఉన్నాయి. గతేడాది భారత్ స్టాక్ మార్కెట్ 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది. 2007 మేలో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని సాధించింది. మార్కెట్ క్యాప్ రెట్టింపు కావడానికి 10 ఏళ్లు సమయం పట్టింది. 2017 జూలైలో మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

2021 మేలో మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. నవంబర్ 29న 4 లక్షల కోట్ల డాలర్లు దాటింది. చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ వరుసగా రెండో సంవత్సరం క్షీణించింది. బీజింగ్ కఠినమైన కోవిడ్-19 పరిమితులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతతో సహా ఇతర కారణాల వల్ల చైనా మార్కెట్ క్షీణించింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ నిరంతరం కొత్త గరిష్టాలను నమోదు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News