Monday, December 23, 2024

నా నటనలో మరింత పరిణతి కనిపిస్తుంది

- Advertisement -
- Advertisement -

హీరోయిన్‌గా రష్మిక ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉంది. తెలుగులో పుష్ప వంటి పాన్ ఇండియా హిట్, బాలీవుడ్‌లో యానిమల్ వంటి మెగా బ్లాక్‌బస్టర్ అందుకొని రష్మిక స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అయితే ఇప్పటివరకు తన నటన వేరు… ఇకపై ప్రేక్షకులు చూసే అభినయం వేరు అని చెబుతోంది అందాల తార రష్మిక. ఇప్పుడు నటిగా తనకు పరిణతి వచ్చిందని అని చెప్పుకుంటోంది.

నటిగా, వ్యక్తిగా తనకు ఎంతో అనుభవం వచ్చిందని ఈ భామ పేర్కొంది. “ప్రస్తుతం నేను 20 ఏళ్ల అమ్మాయిని కాదు కదా. జీవితంలో చూసిన అనుభవాలు, నటిగా పలు సినిమాలు చెయ్యడం వల్ల వచ్చిన తెలివి వల్ల ఇప్పుడు పాత్రలను, ఆ పాత్రల స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోగలుగుతున్నా. యానిమల్ సినిమాలోనే ఆ తేడా మీకు కనిపించింది. అందుకే ఆ పాత్రకు అంతగా ప్రశంసలు దక్కాయి. ఇక పుష్ప 2 సినిమాలో నా నటనలో మరింత పరిణతి కనిపిస్తుంది”అని రష్మిక చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News